Monday, September 5, 2016
Friday, September 2, 2016
బ్రహ్మాస్ దెబ్బకు చైనా విలవిల
బ్రహ్మాస్ దెబ్బకు చైనా విలవిల
ప్రపంచంలోనే అరివీర భయంకరమైన క్షిపణిలోకెల్లా మేటి అయిన బ్రహ్మస్ ను చైనా సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ లో మోహరించడమే కాకుండా ,చైనా ఆక్రమించుకోవాలని చూస్తున్న వియత్నామ్ లాంటి చిన్న దేశానికి భారత్ బ్రహ్మస్ క్షిపణులను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకోనుంది .
ఈ ఒప్పందం చైనా గుండెల్లో మొట్టమొదటి సారిగా దడ పుట్టిస్తుంది .ఇప్పటివరకు తనకు ఎదురులేదంటూ ,అహంకారం గా విర్రవీగుతున్న చైనాకు బ్రహ్మస్ రూపంలో ముచ్చెమటలు పడుతున్నాయి.
అసలు చైనా బ్రహ్మస్ కు ఎందుకు భయపడుతుంది ?
బ్రహ్మస్ విశేషాలు
రష్యా,భారత్ సంయుక్త సహకారం తో అరివీర భయంకరం గా బ్రహ్మస్ రూపుదిద్దుకుంది .బ్రహ్మస్ పరిధి 300 కిలోమీటర్లే అయినా ఇది పర్వత ప్రాంతాల్లో శత్రు లక్షాలమీద పెను విధ్వంసం సృష్టించి వాటిని నామ రూపాల్లేకుండా పూర్తిగా నాశనం చేస్తుంది .బ్రహ్మస్ కు నేలమీద,నీటిలోను,ఆకాశంలోనూ శత్రులక్షాలమీద సునాయాసం గా ప్రయోగించవచ్చు .ఒక్కసారి బ్రహ్మస్ ను ప్రయోగిస్తే అడ్డుకునే శక్తి ఇప్పటివరకయితే ఏ దేశానికీ అంత సమర్థం గా లేకపోవడం బ్రహ్మస్ కు ఉన్న పెద్ద అనుకూలత .
written by amirineni praveen kumar
Subscribe to:
Posts (Atom)


